కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ స్కూల్స్ : ఎర్రబెల్లి  

కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ స్కూల్స్ : ఎర్రబెల్లి

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రభుత్వ స్కూళ్లంటిని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్గీష్ మీడియం బోధించేందుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు మంత్రి వెల్లడించారు. వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండలం కొండూరు గ్రామంలోని ప్రభుత్వ స్కూళ్లలో రూ. 32 లక్షలతో మౌలిక వసతులు కల్పించే పనులకు దయాకర్ రావు శంకుస్థాపన చేశారు.కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ స్కూల్స్ : ఎర్రబెల్లి  అనంతరం తమ పాఠశాలకు అదనపు గదులు, టాయిలెట్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్ వంటి సౌకర్యాలు కావాలని అడిగిన విద్యార్థులు శ్రావణి, లావణ్య, చరణ్ ల కోరిక మేరకు రూ. కోటి ప్రత్యేక నిధులతో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. దీంతో పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గోపి, జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతితో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు, విద్యార్థులు, గ్రామప్రజలు పాల్గొన్నారు.