తెలంగాణ మంత్రికి నిరసన సెగలు

తెలంగాణ మంత్రికి నిరసన సెగలుఖమ్మం జిల్లా: ఖమ్మం నగరంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల పర్యటనకు వచ్చిన రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. నో ఎల్ఆర్ఎస్ …గో టీఆర్ఎస్ అని నినాదాలు చేస్తూ ఎన్ఎస్పీ కెనాల్ పై నిర్మించిన వాక్ వే ట్రాక్ వద్ద కేటీఆర్ పర్యటనను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి , ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం మంత్రి కేటీఆర్ ఖమ్మం నగరంలో 27 కోట్లతో నిర్మించిన ఐటీ హబ్ ను ప్రారంభించారు. ఐటీ హబ్ లో ఐదు ఫ్లోర్లు పరిశీలిస్తూ కలియ తిరుగుతూ ఆనందం వ్యక్తం చేసిన కేటీఆర్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృషిని అభినందించారు.