వరంగల్లో వ్యబిచారం గుట్టు రట్టు

వరంగల్లో వ్యబిచారం గుట్టు రట్టు

వరంగల్ అర్బన్ జిల్లా : నగరంలోని మట్టేవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోగల ఖిలావరంగల్ కు చెందిన మేకల కుమారస్వామి, జమ్మికుంటకు చెందిన బోనాసి స్వర్ణలతలు కలిసి రామన్నపేట, సంతోషిమాత కాలనీలో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అద్దెకు తీసుకున్న ఇంటిని వ్యబిచార గృహముగా మార్చారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలు, హైదరాబాద్ మరియు వివిధ ప్రాంతాలకు చెందిన యువతులను తీసుకుని వచ్చి, వారి ఫోటోలను ఆకర్షించే విధంగా , అర్ధనగ్న ఫోటోలను తీసి వాట్సప్ ద్వారా యువకులకు , ఇతర వ్యక్తులకు పంపించి వ్యబిచార గృహాలకు రప్పించేవారు. ఈ విధంగా వ్యబిచారం నడిపిస్తూ, యువతుల జీవితాలతో డబ్బు సంపాదిస్తున్నట్లు వచ్చిన పక్కా సమాచారంతో వరంగల్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ బి.ప్రతాప్ కుమార్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్స్ బి.నందిరాం, మధు టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కలిసి అట్టి వ్యబిచార గృహంపై దాడి చేశారు. వ్యబిచార గృహంను నిర్వహిస్తున్న మేకల కుమారస్వామి, బోనాసి స్వర్ణలతను, ఒక మహిళతో పాటు ముగ్గురు విటులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఒక్కొక్క యువకుని వద్ద నుంచి రూ.2వేల నుంచి రూ.5వేల వరకు నిర్వహకులు ఫీజు తీసుకుంటున్నట్లు టాస్క్‌ ఫోర్స్ పోలీసులు తెలిపారు. వ్యబిచార గృహములో కండోమ్స్ ప్యాకెట్స్, నగదు రూ. 10,140/- , ద్వి చక్ర వాహనాలను, మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు..