బాధితులకు ధైర్యం చెప్పిన సీఎం

ఏలూరు: ఏలూరులో అస్వస్థతకు గురైనవారిని సీఎం జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను నేరుగా కలిసి, వారి ఆరోగ్య స్థితిగతులను తెలుసుకున్నారు. బాధితులకు ధైర్యం చెప్పి, అన్ని విధాలుగా అండగా ఉంటామని సీఎం జగన్ బాధితులకు భరోసా ‎ఇచ్చారు. వైద్యులతో మాట్లాడి అస్వస్థతకు గురైన వారికి అందిస్తున్న వైద్యసహాయం, ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను అడిగితెలుసుకున్నారు. అస్వస్థతకు దారితీసిన కారణాలపై సీఎం జగన్ వైద్యులను ఆరాతీసారు. ఇప్పటి వరకు చేసిన వైద్య పరీక్షల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

బాధితులకు ధైర్యం చెప్పిన సీఎం

దీనిపై స్పందించిన వైద్యులు అస్వస్థతకు గురైన బాధితులకు చేస్తున్న వైద్యాన్ని సీఎంకు వివరించారు. అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. సమీక్షా సమావేశానికి మంత్రులు ఆళ్లనాని, శ్రీరంగనాథ రాజు తానేటి వనిత, పేర్ని నాని, వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనికుమార్‌ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు సహా పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సీఎం పలు సూచనలు, ఆదేశాలు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల అస్వస్థతకు గల కారణాలు పూర్తి స్థాయిలో తెలియకపోవడంతో అప్రమత్తంగా వుండాలని వైద్య ఆరోగ్య శాఖను సీఎం జగన్ ఆదేశించారు. బాధితులకు ధైర్యం చెప్పిన సీఎంఎయిమ్స్‌ సహా ఐఐసీటీ, ఎన్‌ఐఎన్‌ బృందాలు వచ్చాక వారి పరిశీలనలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఏ ఘటన జరిగినా వెంటనే స్పందించేలా ఉండాలని, వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు ఏలూరులో ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. ఎవరికి ఎలాంటి అస్వస్థత కలిగినా ప్రజలు అప్రమత్తంగా వుండి 104,108 నంబర్లకు కాల్‌చేసేలా అవగాహన కల్పించాలని, కాల్‌ వచ్చిన వెంటనే వారికి వైద్యం అందేలా చూడాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.