పోలింగ్​లో చిచ్చుపెట్టిన గుర్తు

పోలింగ్​లో చిచ్చుపెట్టిన గుర్తు
అర్థాంతరంగా ఆగిపోయిన పోలింగ్​
3న ఓల్డ్​ మలక్​పేటలో రీపోలింగ్​: ఎలక్షన్​ కమిషనర్​ పార్థసారథి

 

పోలింగ్​లో చిచ్చుపెట్టిన గుర్తు

హైదరాబాద్ ​: గ్రేటర్​ ఎన్నికల పరిధిలోని ఓల్డ్​ మలక్​పేటలో రీ పోలింగ్​ నిర్వహించనున్నట్లు , రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్​ పార్థసారధి చెప్పారు. డివిజన్​లోని పోలింగ్​ నమూనా బ్యాలెట్​లో పత్రంలో సీపీఐ కంకికొడవలి గుర్తుకు బదులు సీపీఎం గుర్తు సుత్తె కొడవలి గుర్తును ప్రింట్​ చేశారు. అయితే ఇది గమనించిన సీపీఐ పార్టీ నాయకులు ఎలక్షన్​ కమిషన్​కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఎలక్షన్​ కమిషన్​ మలక్ పేట్ డివిజన్ బ్యాలెట్ వ్యవహారంలో ప్రింటింగ్ ప్రెస్ లో సింబల్ ప్రింట్ తప్పు పడిందని వివరించారు. ఇక్కడ ఈ నెల మూడో తేదీన ఓటింగ్​ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.