రాజీనామా వెనక్కి తీసుకున్న కార్పోరేటర్ శారదా జోషి

 

రాజీనామా వెనక్కి తీసుకున్న కార్పోరేటర్ శారదా జోషి
వరంగల్ అర్బన్ : గ్రేటర్ అధికారుల నిర్లక్ష్యంతో వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 15వ డివిజన్ కార్పోరేటర్ శారదా జోషి రాజీనామాకు సిద్ధమైంది. 15 వ డివిజన్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోవడం లేదనే కారణంతో కార్పోరెటర్ శారదా జోషి రాజీనామాకు సిద్ధమైనట్లు ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజల మధ్యలో వుంటూ ప్రజలకు సేవచేయాల్సి పోయి, వేసవికాలంలో డివిజన్ ప్రజల దాహార్తిని కూడా తీర్చకపోవడం అవమానంగా వుందని ఆవేదన చెందిన కార్పోరెటర్ శారదా జోషి శుక్రవారం రాజీనామాకు సిద్ధమైంది. అయితే విషయం తెలుసుకున్న వరంగల్ తర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ , రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి కార్పోరేటర్ శారదాజోషిని కలిసారు. డివిజన్ సమస్యలు తెలుసుకుని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో కార్పోరేటర్ శారదా జోషి తన రాజీనామాను వెనక్కి తీసుకుంది.