నేడు జపాన్ తో అమీతుమీ తేల్చుకోనున్న భారత్

నేడు జపాన్ తో అమీతుమీ తేల్చుకోనున్న భారత్ఢాకా : వరుస విజయాలతో ఆసియా చాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ కు చేరిన భారత పురుషుల హాకీ జట్టు మంగళవారం జపాన్ తో అమీతుమీ తేల్చుకోనుంది. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఆడిన 4 మ్యాచ్ ల్లో విజయం సాధించింది.

కొరియాతో జరిగిన మొదటి మ్యాచ్ ను డ్రా చేసుకున్న భారత్ ఆ తర్వాత 9-0తో బంగ్లాదేశ్ పై, 3-1తో పాకిస్థాన్ పై, 6-0తో జపాన్ పై సక్సెస్ లు సాధించింది. దీంతో 10 పాయింట్లు తన ఖాతాలో వేసుకున్న భారత్ పట్టికలో అగ్రస్థానంతో నాకౌట్ కు చేరింది.

చివరి లీగ్ మ్యాచ్ లో జపాన్ పై ఏకపక్ష విజయం సాధించిన మన్ ప్రీత్ సేన మంగళవారం మరోసారి జపాన్ తో పోటీపడనున్నది. హర్మన్ ప్రీత్ సింగ్, దిల్ ప్రీత్ సింగ్, జర్మన్ ప్రీత్ సింగ్, లలిత్ పుల్ జోష్ లో ఉండటం భారత్ కు కలిసొచ్చే అంశం. కాగా ఆదివారం పోరులో కనీస పోటీనివ్వలేకపోయిన జపాన్ ఏ మాత్రం పోరాడుతుందో చూడాలి. మంగళవారమే జరుగనున్న మరో సెమీస్ లో పాకిస్థాన్, దక్షిణకొరియా తలపడనున్నాయి.