పీవీ సింధుకు బీడబ్ల్యూఎఫ్ కమిషన్ లో చోటు

పీవీ సింధుకు బీడబ్ల్యూఎఫ్ కమిషన్ లో చోటు

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు మరోమారు అరుదైన అవకాశం లభించింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ( జీడబ్ల్యూఎఫ్) అథ్లెట్స్ కమిషన్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆరుగురు సభ్యులు గల ఈ కమిషన్ లో ఆమె 2025 వరకు కొనసాగుతారు. భారత్ కు ఒలింపిక్స్ లో పీవీ సింధు రెండు పతకాలు సాధించిన సంగతి తెలిసిందే.పీవీ సింధుకు బీడబ్ల్యూఎఫ్ కమిషన్ లో చోటుఈ కమిషన్ లో పీవీ సింధుతో పాటు అమెరికాకు చెందిన ఐరిస్ వాంగ్, నెదర్లాండ్స్ ప్లేయర్ రాబిన్ తాబ్లింగ్, ఇండోనేషియాకు చెందిన గ్రేసియా పోలీ, దక్షిణ కొరియా నుంచి కిమ్ సోయెంగ్, చైనా ప్లేయర్ జెంగ్ వీ నియమితులు కావడం ఎంతో సంతోషంగా ఉందని బీడబ్ల్యూఎఫ్ ఓ ప్రకటనలో పేర్కొంది.

అథ్లెట్స్ కమిషన్ సభ్యులే చైర్మన్, డిప్యూటీ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. త్వరలోనే ఈ కొత్త కమిషన్ సమావేశమై కమిషన్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ లను ఎన్నుకుంటారని బీడబ్ల్యూఎఫ్ పేర్కొంది. అథ్లెట్స్ కమిషన్ చైర్మన్ కు బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ లో చోటు లభిస్తుంది. ఇటీవల స్పెయిన్ లో జరిగిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్ షిప్ టోర్నీ సందర్భంగా ఈ నెల 17న అథ్లెట్స్ కమిషన్ ఎన్నికలు జరిగాయి.