ఈజిప్ట్ లో సత్తా చాటిన తెలంగాణ అమ్మాయి

ఈజిప్ట్ లో సత్తా చాటిన తెలంగాణ అమ్మాయికైరో : అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ వేదికపై తెలంగాణ అమ్మాయి సత్తా చాటింది. ఈజిప్ట్ లో జరుగుతున్న ఫారోస్ కప్ 2021లో హైదరాబాదీ అరుణారెడ్డి సూపర్ షో కనబరిచింది. ఇంటర్నేషనల్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్ లో తెలంగాణకు చెందిన బుద్ధా అరుణారెడ్డి 2 స్వర్ణ పతకాలు సాధించింది. అరుణారెడ్డి ఇటీవలే మోకాలి సర్జరీ నుంచి కోలుకొని మరీ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ లో స్వర్ణ పతకాలు సాధించడం విశేషం. ఇంతకు ముందు 2018 ప్రపంచ జిమ్నాస్టిక్ ఛాంపియన్ షిప్ లో అరుణారెడ్డి కాంస్యం సాధించింది.