గాదరి మారయ్య మృతి పట్ల కేసీఆర్ సంతాపం

హైదరాబాద్ : తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తండ్రి గాదరి మారయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. కిషోర్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గాదరి కిషోర్ తండ్రి మారయ్య (73) శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూశారు.

నల్లగొండ మండలం నర్సింగ్ భట్లకు చెందిన గాదరి మారయ్య పీఈటీగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో సేవలందించారు. ప్రస్తుతం నల్లగొండ పట్టణంలో ఆయన కుటుంబంతో కలిసి శేషజీవితం గడుపుతున్నారు. గాదరి కిషోర్ తండ్రి మారయ్య మృతి పట్ల మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.