చేతగాని అరవింద్ నోరు అదుపులో పెట్టుకో : దాస్యం

చేతగాని అరవింద్ నోరు అదుపులో పెట్టుకో : దాస్యంహైదరాబాద్ : పసుపు బోర్డు తెస్తానని పారిపోయిన ధర్మపురి అరవింద్ కు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయం మీద, సీఎం కేసీఆర్ పై విమర్శలు చేసే నైతిక హక్కు లేదని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హెచ్చరించారు. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుంటే, రైతులను హత్యలు చేస్తూ టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.

హైదరాబాద్ లో తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దాస్యం వినయ్ భాస్కర్ ధర్మపురి అరవింద్ పై నిప్పులు చెరిగారు. బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని , ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.

విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రంలో బీజేపీ విఫలమైందని విమర్శించారు. చేతకాని అరవింద్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటని దాస్యం దుయ్యబట్టారు. రేపు జరిగే హుజురాబాద్ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు గెల్లు శ్రీనివాస్ ని భారీ మెజారిటీతో గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.