స్కూటీ ఇసుక లారీ ఢీ..యువకుడు మృతి

స్కూటీ ఇసుక లారీ ఢీ..యువకుడు మృతివరంగల్ రూరల్ జిల్లా: ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇసుక లారీ స్కూటీని ఢీకొట్టడంతో స్కూటీపై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకుల్లో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యారు. క్షతగాత్రులను స్థానికులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మృతుడు శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన బండ వాసుదేవరెడ్డి(20) గా స్థానికులు గుర్తించారు.