వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న పవన్


గుడివాడ: కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలో డోకిపర్రు శ్రీ భూ సమేత వెంకటేశ్వరస్వామిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. మెగా కృష్ణారెడ్డి దంపతులు జనసేనానికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం వేదపండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు పవన్ కళ్యాణ్ కు అందచేశారు. ఈపూజా కార్యక్రమాల్లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, కృష్ణా జిల్లా జనసేన నాయకులు ఉన్నారు. ఈసందర్భంగా ఆయనను చూసేందుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.