రెండో రోజు.. 144 రన్స్ ఆధిక్యంలో భారత్ 

రెండో రోజు.. 144 రన్స్ ఆధిక్యంలో భారత్ 

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : నాగ్ పూర్ టెస్టులో రెండో రోజు టీం ఇండియా జోరు కొనసాగించింది. రెండో ఆట ముగిసే సరికి భారత్ 144 పరుగుల ఆధిక్యంలో ఉంది. రోహిత్ శర్మ సెంచరీతో కదం తొక్కాడు. ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఇద్దరూ ఆఫ్ సెంచరీలతో ఆదుకున్నారు. ఎనిమిదో వికెట్ కు 81 పరుగులు జోడించారు. దీంతో టీం ఇండియా 7 వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది.

కోహ్లీ (12), పుజారా(7) అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్ (8) స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. ఈ ముగ్గురిని ఔట్ చేసిన మర్ఫీ ఆస్ట్రేలియాను పోటీలో నిలిపాడు. రోహిత్ ఔటయ్యాక వీళ్లిద్దరూ ధాటిగా ఆడుతూ జట్టు స్కోర్ 300 దాటించారు. మర్ఫీ, లియాన్ స్పిన్ ను సమర్ధంగా ఎదుర్కొన్నారు.

వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ వేగం పెంచారు. ఈ పిచ్ పై 250 పైగా స్కోర్ చేస్తే, ఆతిథ్య ఆస్ట్రేలియాను ఒత్తిడిలోకి నెట్టొచ్చని మాజీలు అంటున్నారు. దాంతో మూడో రోజు ఆట కీలకం కానుంది.