భర్త చేతిలో భార్య దారుణ హత్య !

వరంగల్ టైమ్స్, ఏలూరు జిల్లా : ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. కుటంబ కలహాల నేపథ్యంలో ముసునూరు మండలం రమణక్కపేటలో భార్యను భర్త అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం పారిపోయాడు. వెంటనే స్థానికులు మహిళను ఆస్పత్రికి తరలించే లోపు మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.