రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా శకటాలు

రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా శకటాలున్యూఢిల్లీ : 73 రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకుని ఢిల్లీలోని రాజ్ పథ్ లో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ జాతీయపతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఈ వేడుకల్లో త్రివిధ దళాల మార్చ్ ఫాస్ట్ , విన్యాసాలు, శకటాల ప్రదర్శన, వివిధ రాష్ట్రాలు, కేంద్రమంత్రిత్వశాఖల శకటాల ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకున్నాయి. రాష్ట్రాల శకటాలు పరేడ్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా శకటాలుమేఘాలయ రాష్ట్రానికి చెందిన శకటంపై మహిళలు వెదురు బుట్టలు అల్లుతున్నట్లుగా ఉన్న నమూనా ప్రత్యేకతను సంతరించుకుంది. గుజరాత్ శకటం ప్రధానంగా అక్కడి గిరిజనుల పోరాటపటిమను చాటిచెప్పింది. ఉత్తరాఖండ్ శకటంలో హేమకుంద్ సాహిబ్, బద్రీనాథ్ నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గోవా శకటాన్ని అక్కడి వారసత్వ చరిత్రను చాటిచెప్పేలా డిజైన్ చేశారు.

 

అదేవిధంగా కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్, జమ్ము అండ్ కశ్మీర్ శకటాలు కూడా 73వ రిపబ్లిక్ డే పరేడ్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. టోక్యో ఒలింపిక్స్ లో మొత్తం 7 పతకాలు రాగా, అందులో 4 పతకాలు హర్యానా ఆటగాళ్లకే దక్కడం ఆ రాష్ట్రం శకటంపై క్రీడాకారుల నమూనా ఆకట్టుకున్నది. యూపీ శకటంపై స్కిల్ డెవలప్మెంట్ , ఉపాధి కల్పనకు సంబంధించిన నమూనాలను ప్రదర్శించారు.