త్వరలో రూ. 100 నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ !
వరంగల్ టైమ్స్, అమరావతి : త్వరలో భారత ప్రభుత్వం రూ.100 నాణెం తీసుకువస్తోంది. దీన్ని పూర్తిగా వెండితో తయారుచేయనున్నారు. ఈ వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ బొమ్మను ముద్రించనున్నారు. దీనికి సంబంధించిన నమూనాపై సూచనలు, సలహాలు తీసుకునేందుకు మింట్ అధికారులు ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరిని కలిశారు. పురంధేశ్వరికి వారు ఈ వెండినాణేన్ని, దానిపై ఎన్టీఆర్ బొమ్మ మోడల్ ను చూపించారు. ఈ నమూనాకు పురంధేశ్వరి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఎన్టీఆర్ బొమ్మతో ఈ రూ.100 నాణెం బయటికి రానుంది.