స్థిరంగా కరోనా కేసులు

అమరావతి : ఏపీలో కరోనా కేసులు స్థిరంగా ఉన్నాయి. శుక్రవారం కొత్తగా 520 కేసులునమోదయ్యాయి. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,74,515 పాజిటివ్ కేసు లకు గాను 8,62,230 మంది డిశ్చార్జ్ కాగా.. 7,049 మంది మృతిచెందారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 5,236 ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు.