తిరుమల: ప్రతీ యేడు పవిత్ర మైన ధనుర్మాసంను పురస్కరించుకుని తిరుమలలో టీటీడీ మార్గశిర విష్ణు వైభవ ప్రవచనంను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే ఈ యేడు డిసెంబర్ 15 నుంచి మార్గశిర విష్ణు వైభవ ప్రవచనం ను టీటీడీ అధికారులు ప్రారంభించారు. ఇందుకోసం ప్రతిరోజు మార్గశిర విష్ణు వైభవ ప్రవచనం నిర్వహించడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. తిరుమల నాద నీరాజన వేదిక మీద డిసెంబరు 15 నుంచి జనవరి 14 వరకు రోజూ ఉదయం 6 నుంచి 6.45 గం.ల వరకు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఎస్వీ బీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నాదనీరాజన వేదిక మీద టీటీడీ నిర్వహించిన కార్తీక పురాణ ప్రవచనానికి భక్తుల నుంచి భారీ స్పందన లభించింది. వేద పండితులు శ్రీ మారుతి నిర్వహించిన ఈ ప్రవచనం సోమవారంతో ముగిసింది. భక్తుల స్పందన వల్ల మార్గశిర మాసంలో కూడా ఇలాంటి ప్రవచనం కార్యక్రమం నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. వేద పండితులు శ్రీ శేషాచార్యులు నెల రోజుల పాటు ప్రవచనం చెబుతారు. ఎస్వీ బీసీ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.