తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంతూర్పుగోదావరి జిల్లా కోటిపల్లి, యానాం ఏటిగట్టు రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న వారు మృతిచెందారు. మృతులంతా యానాం వాసులుగా పోలీసులు గుర్తించారు.