సైబరాబాద్ లో ప్రత్యేక బందోబస్తు : సీపీ సజ్జనార్

సైబరాబాద్ లో ప్రత్యేక బందోబస్తు : సీపీ సజ్జనార్‍హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలో 7 వేల మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సి.పి. సజ్జనార్ తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 48గంటల వరకు ఎటువంటి ర్యాలీలకు అనుమతి లేదని, కొన్ని చోట్ల ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశామని సి.పి. సజ్జనార్ తెలిపారు. అయితే కౌంటింగ్ మాత్రం మధ్యాహ్నం 3గంటల వరకు జరుగవచ్చని తెలిపారు.