కర్నూలులో రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి

కర్నూలు: జిల్లాలోని గూడూరు సమీపంలో కరెంట్ సబ్ స్టేషన్ దగ్గర బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.  ట్రాక్టర్,  మోటర్ బైక్ పరస్పరం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.