రైతులకు న్యాయం జరిగేలా చూస్తా : పవన్‌

రైతులకు న్యాయం జరిగేలా చూస్తా : పవన్‌

విజయవాడ: నివర్‌ తుఫాన్​ కారణంగా జరిగిన పంటనష్టాన్ని పరిశీలించేందుకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బుధవారం కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌తో కలిసి ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న పవన్‌కు కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కంకిపాడు, పామర్రు తదితర ప్రాంతాల్లో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పవన్‌ మీడియాతో మాట్లాడారు. రైతులకు భరోసా ఇచ్చేందుకే వచ్చినట్టు చెప్పారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు ఆర్థిక సాయం వచ్చేలా కృషి చేస్తామన్నారు.రైతులు ఎవరూ అధైర్యపడొద్దన్నారు. . అంనతరం గుంటూరు జిల్లా వెళ్లనున్నారు.

రైతులకు న్యాయం జరిగేలా చూస్తా : పవన్‌