బొమ్ములూరు వద్ద రోడ్డు ప్రమాదం

కృష్ణాజిల్లా: బాపులపాడు మండలం బొమ్ములూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొమ్ములూరు వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. జాతీయ రహదారిపై తెల్లవారుజామున 3.30 గంటలకు ఈఘటన జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో అక్కడిక్కడే ముగ్గురు మృతి చెందగా , నలుగురికి గాయాలయ్యాయి. భీమవరంలో వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం..