నేడు ఢిల్లీకి ఏపీ సీఎం

నేడు ఢిల్లీకి ఏపీ సీఎంఅమరావతి: అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ 15న ఢిల్లీ వెళ్లనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో ఢిల్లీ పర్యటనలకు బయల్దేరి..సాయంత్రం 4గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాత్రి 9 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. వరదలతో నష్టపోయిన తమ రాష్ట్రానికి పరిహారం చెల్లించాల్సిందిగా రెండు రోజుల క్రితమే కేంద్రానికి సీఎం జగన్ లేఖ రాసారు. ఈ నేపథ్యంలోనే అమిత్ షాను కలబోతున్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన పెండింగ్ అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన సమస్యల పరిష్కారంపై కూడా చర్చించే అవకాశం ఉందంటున్నారు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసిన వెంటనే….ఏపీ సీఎం ఢిల్లీకి వెళ్తుండటం ఆసక్తికరంగా మారింది.