భద్రకాళిని దర్శించుకున్న ఎంపీ సంతోష్​

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ సంతోష్​కుమార్

భద్రకాళిని దర్శించుకున్న ఎంపీ సంతోష్​వరంగల్​ అర్బన్ జిల్లా​ : వరంగల్ పట్టణంలోని భద్రకాళి అమ్మవారిని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ గురువారం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు ఎంపీ తెలిపారు. అమ్మవారి దర్శనానంతరం ఆయన ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ఆయన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులతో పాటు మొక్కలు పంపిణీ చేశారు. సంతోష్ కుమార్ వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఉన్నారు.