కేంద్రంపై నిరసన సెగలు

తెలంగాణ: బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని రైతులు, కార్మిక సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ కు బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్, ప్రభుత్వ, వాణిజ్య, వ్యాపార సంస్థలు స్వచ్ఛంధంగా బంద్ పాటించాయి. రాష్ట్ర వ్యాప్తంగా వున్న ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. తెలంగాణలో అధికారంలో వున్న టీఆర్ఎస్ పార్టీ నేతలతో పాటు, అఖిలపక్షం నాయకులు, రైతులు, కార్మికులు, ఉద్యోగులంతా కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రోడ్డెక్కారు. ఒకప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే దిశగా తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు చేపట్టిన ఉద్యమం తీరుగా భారత్ బంద్ లో పాల్గొన్న అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు నిరసన గళం వినిపించాయి. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిలపక్షం నేతలు ప్రధాని మోడీ తీరును విమర్శించారు. రైతులపై కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటూ బైక్ లపై ర్యాలీలు నిర్వహిస్తూ నినాదాలు చేశారు. జై జవాన్ జై కిసాన్ అంటూ వంటా వార్పులు చేస్తూ జాతీయ రహదారులు దిగ్భంధం చేసి రైతులకు మద్దతుగా నిలిచి కేంద్రాన్ని తమదైన నిరసన శైలిలో హెచ్చరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ జిల్లా నర్సంపేట రోడ్డులో రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, కార్మికులు రహదారుల దిగ్భంధం చేశారు. హన్మకొండ-హైదరాబాద్ జాతీయ రహదారి మడికొండ కూడలిలో రాష్ట్ర పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్భంధం చేశారు. రోడ్డుపై వంటా వార్పు చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వర్ధన్నపేట నియోజకవర్గంలో రాస్తారోకోలో పాల్గొన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించి భారత్ బంద్ కు మద్దతు తెలిపారు.రైతుల వెంటే కేసీఆర్, నో ఫార్మర్, నో ఫుడ్, రైతు లేనిదే రాజ్యం లేదు, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం-రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అంటూ నిరసనలు తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి , స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి , రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు బైక్ లపై ట్రాక్టర్లపై ర్యాలీలు నిర్వహించి రోడ్లను దిగ్భంధం చేశారు. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. రైతుల త‌ర‌పున దీర్ఘ‌కాలికంగా పోరాడేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంద‌ని ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. రైతుల‌కు ఎవ‌రు ద్రోహం చేసినా టీఆర్ఎస్ ఎండ‌గ‌డుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్‌న‌గ‌ర్ బూర్గుల టోల్‌గేట్ వ‌ద్ద రైతుల‌కు మ‌ద్ద‌తుగా కేటీఆర్ భార‌త్ బంద్‌లో పాల్గొన్నారు.

కేంద్రంపై నిరసన సెగలురైతుల త‌ర‌పున దీర్ఘ‌కాలికంగా పోరాడేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంద‌ని ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. రైతుల‌కు ఎవ‌రు ద్రోహం చేసినా టీఆర్ఎస్ ఎండ‌గ‌డుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్‌న‌గ‌ర్ బూర్గుల టోల్‌గేట్ వ‌ద్ద రైతుల‌కు మ‌ద్ద‌తుగా కేటీఆర్ భార‌త్ బంద్‌లో పాల్గొన్నారు.

రైతులకు మద్దతుగా అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ పట్టణంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం కడ్తాల్ గ్రామం వద్ద జాతీయ రహదారి 44పై రైతులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు.కేంద్రంపై నిరసన సెగలునిజామాబాద్ జిల్లా వేల్పూర్ క్రాస్ రోడ్డు వద్ద రైతులు, టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భారత్ బంద్ లో పాల్గొన్నారు. రైతుల వెంటే కేసీఆర్, నో ఫార్మర్, నో ఫుడ్, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదంటూ ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేస్తూ రోడ్డుపై బైఠాయించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలంటే మంత్రి కొప్పుల ఈశ్వర్ కరీంనగర్ నుంచి ధర్మపురి వెళ్లే రహదారిపై రాస్తారోకో చేశారు. మంత్రి కొప్పుల నిరసన ర్యాలీలో పెద్ద సంఖ్యలో రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.

కేంద్రంపై నిరసన సెగలుకేంద్ర ప్రభుత్వం స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో తీసుకువస్తున్న నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం జిల్లాలో నిరసన తెలిపారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి సర్కిల్ లో రైతులతో కలిసి మంత్రి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు.
కేంద్రంపై నిరసన సెగలు

మోదీ రైతు వ్యతిరేక విధానాలను ఖండిస్తూ భారత్ బంద్ కు మద్దతుగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులు, కార్మికులు, టీఆర్ఎస్ శ్రేణులు తూప్రాన్ వై జంక్షన్ పై వున్న జాతీయ రహదారిని దిగ్భంధించారు.

కేంద్రంపై నిరసన సెగలు

రైతుల నెత్తురు చిందకుండా వ్యవసాయ రంగంలో కేంద్రం తీసుకొచ్చన నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. భారత్ బంద్‌లో భాగంగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో జరిగిన ధర్నాను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. పల్లెలు బాగు పడాలంటే రైతులు బాగు పడాలన్నారు. రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం అన్నారు. కానీ, బీజేపీ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్‌లో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రైతులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. రాస్తారోకోలో రైతులు, టీఆర్ఎస్ సీపీఎం, సీపీఐ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం, జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత పాల్గొన్నారు.

రైతుల నడ్డి విరిచేలా కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలు వున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ కు మద్దతుగా కామారెడ్డి శివారులోని ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్సీ కవిత నిరసన గళం వినిపించారు. టెక్రియాల్ వద్ద 44వ జాతీయ రహదారిపై రైతులతో కలిసి కవిత ఆందోళన నిర్వహించారు.కేంద్రంపై నిరసన సెగలుకేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆద్వర్యంలో నిరసనలు వెల్లువెత్తాయి. ములుగు మండలం పందికుంట వద్ద ధర్నా, రాస్తారోకో చేశారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మొత్తానికి రైతులు, కార్మిక సంఘాలు తలపెట్టిన భారత్ బంద్ కు మద్దతుగా నిరసనలు చేపట్టిన టీఆర్ఎస్, అఖిలపక్షం నాయకులు తమ నిరసనల ద్వారా కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. అవసరమైతే, రైతు ఉద్యమాన్ని గల్లీల నుండి ఢిల్లీ వరకు తీసుకెళతామని, రైతులకు న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.