జిల్లాలో కేంద్రమంత్రి విస్తృత పర్యటన

జిల్లాలో కేంద్రమంత్రి విస్తృత పర్యటనఆదిలాబాద్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి మంగళవారం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు.ముందుగా పట్టణంలోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాల, వైద్యశాలలను సందర్శించారు. రిమ్స్ హాస్పిటల్ లో కేంద్ర నిధులతో చేపట్టిన వివిధ కార్యక్రమాలు ,అక్కడి వసతులపై అధికారులతో చర్చించారు. “ప్రధానమంత్రి సురక్ష యోజన కింద 150 కోట్లతో చేపట్టిన ఈ రిమ్స్ లో కేంద్రం రూ. 120 కోట్లు కేటాయించగా, రాష్ట్రం వాటాగా రూ.30 కోట్లు ఉండగా ఇంకా ఈ నిధులు మంజూరు చేయాల్సి ఉందన్నారు. నిధులను త్వరగా విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రమేష్​ ను కోరారు. “ఇక్కడ 500 పడకల ఆసుపత్రి తో పాటు 100 మంది విద్యార్థులు ఎంబీబీఎస్​చదువుకునే వీలుందని చెప్పారు. ఇటీవలే పీజీ సీట్లు కూడా కేటాయించినట్టు పేర్కొన్నారు. త్వరలోనే దవాఖాన పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. “ఆదిలాబాద్ పట్టణంలో అమృత్ పథకం కింద కేంద్రం నిధులు కేటాయించిందన్నారు. రాష్ట్రంలో 12 పట్టణాలలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నదని చెప్పారు. ఆదిలాబాద్, జీహెచ్ఎంసీ, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మిర్యాలగూడ, నల్లగొండ, నిజామాబాద్, రామగుండం సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ పట్టణాలను అమృత్ పథకం కింద అభివృద్ధి చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు 1666 కోట్లతో రాష్ట్ర ఆర్థిక ప్రణాళికలు రూపొందించారని అన్నారు. అందులో 1442 కోట్లు నీటి సరఫరా కి 184 కోట్లు డ్రైనేజ్​కు సంబంధించి 40 కోట్లు ఉద్యానవనాల కార్యక్రమాలపై ఖర్చు చేస్తున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో ఐదు ప్రాజెక్టుల కోసం సుమారు రూ.81 కోట్ల తో వివిధ పనులు చేపట్టామని ఇందులో నీటి సరఫరాకు సంబంధించి రూ. 78.30 కోట్లతో వివిధ పనులు పూర్తి కాగా ఇంకా అక్కడక్కడా కొన్ని పనులు మాత్రమే కావలసి ఉన్నాయన్నారు. అదేవిధంగా పట్టణంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈఎస్​ఎస్​లో ఆధ్వర్యంలో సుమారు 12690 ఎల్​ఈడీ బల్బులను అమర్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సోయం బాపురావు, కలెక్టర్ సిక్టా పట్నాయక్, అడిషనల్ కలెక్టర్ లు డేవిడ్, సంధ్యారాణి, ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ భవేశ్ మిశ్రా, ఐపీఎస్ అధికారి రాజేష్ చంద్ర, సీసీఐ , రైల్వే శాఖ అధికారులు పాల్గొన్నారు.