రేపు భారత్​ నెగ్గేనా?

రేపు భారత్​ నెగ్గేనా?కాన్​బెర్రా ​: టెస్టు సిరీస్​లో రెట్టింపు ఉత్సాహంతో బరిలోకి దిగాలంటే భారత్​కు టీ20 సిరీస్​ విజయం తప్పనిసరి. ప్రస్తుతం కెప్టెన్​ కోహ్లీసేన ఆధ్వర్యంలో ప్రదర్శన గొప్పగానే సాగుతోంది. ఈ ప్రదర్శన ఇలాగే కొనసాగిస్తే సిరీస్​ దక్కించుకోవడం పెద్ద కష్టమేమీకాదు. గత పది టీ20ల్లో టీమిండియా ప్రదర్శన బాగానే ఉంది. కానీ జట్టులో మంచి ఫామ్​లో ఉన్న ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా మ్యాచ్​కు దూరమవ్వడం, ఆటగాళ్లు తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడం కాస్తా ఆందోళనకు గురిచేస్తోంది. అయితే సొంతగడ్డపై సిరీస్​ చేజార్చుకోవద్దని ఆసీస్​ ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో సిరీస్​ ఎవరు చేజిక్కుంచుకంటారోనని క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.