భార్యాభర్తలిద్దరికీ జైలు శిక్ష ఎందుకంటే ?

భార్యాభర్తలిద్దరికీ జైలు శిక్ష ఎందుకంటే ?

వరంగల్ టైమ్స్, నరసాపురం : నరసాపురం జాయింట్ కలెక్టర్ సూర్య తేజ ఓ వృద్ధురాలి ఫిర్యాదు మేరకు సిటిజన్ ట్రిబ్యూనల్ కోర్టును మంగళవారం నిర్వహించారు. వృద్ధురాలుని పట్టించుకోని కొడుకు, కోడలికి 14 రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఈ మాట్లాడారు. నవ మాసాలు మోసి, అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులను వయోవృద్ధుల సమయంలో పక్కన పెట్టి హింస పెడితే శాఖా పరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.