ఇన్నేండ్ల తర్వాత అక్రమ కేసులు కొట్టేసిన కోర్టు
వరంగల్ టైమ్స్, ఏపీ : విద్యార్థి సంఘ నాయకులపై అక్రమ కేసులను 8ఏళ్ల తర్వాత కోర్టు కొట్టేసింది. 2015లో నారాయణ విద్యాసంస్థలలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై నిరసనగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంపై పోలీసులు కేసులు పెట్టారు. ఈ అక్రమ కేసును 5వ అదనపు సివిల్ జడ్జి కోర్ట్ నేడు కొట్టివేసింది. ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులపై పెట్టిన కేసును 8యేళ్ల తర్వాత కోర్టు కిట్టివేయడం జరిగింది.