ఓఎన్జీసీ అధ్యక్ష బాధ్యతల్లో తొలిసారి ఒక మహిళ

ఓఎన్జీసీ అధ్యక్ష బాధ్యతల్లో తొలిసారి ఒక మహిళ
న్యూఢిల్లీ : ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్ జీసీ)కి తాత్కాలిక చైర్ పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ( సీఎండీ)గా అల్కా మిట్టల్ నియమితులయ్యారు. దీంతో దేశంలోని అతిపెద్ది చమురు, గ్యాస్ ఉత్పత్తి సంస్థకు అధిపతి అయిన తొలి మహిళగా అల్కా గుర్తింపు దక్కించుకున్నారు. ఇప్పటిదాకా తాత్కాలిక సీఎండీగా బాధ్యతలు నిర్వహించిన సుభాష్ కుమార్ గత డిసెంబర్ 31న పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో అల్కా మిట్టల్ ను నియమించారు. అల్కా మిట్టల్ ను ఓఎన్జీసీ తాత్కాలిక సీఎండీగా నియమించాలంటూ కేంద్రు పెట్రోలియం, సహజవాయువు శాఖ ప్రతిపాదించింది.

ఈ ప్రతిపాదనకు కేబినెట్ అపాయింట్మెంట్ కమిటీ ఆమోదం తెలిపింది. 6 నెలలపాటు అల్కా మిట్టల్ ఈ పదవిలో అల్కా మిట్టల్ కొనసాగనున్నారు. 2022, జనవరి 1 నుంచి ఆమె పదవీకాలం మొదలైంది. అల్కా మిట్టల్ చమురు, సహజవాయువు పరిశోధన, ఉత్పత్తి కంపెనీకి మొదటి మహిళా అధిపతిగా నిలిచింది. 2014లో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ బాధ్యతలు చేపట్టిన నిషీ వాసుదేవ ఓ ఆయిల్ కంపెనీకి అధిపతి అయిన మొదటి మహిళగా నిలిచారు.