హైదరాబాద్​ పరిస్థితి మార్చేందుకే వచ్చా: అమిత్​షా

హైదరాబాద్​ పరిస్థితి మార్చేందుకే వచ్చా..గ్రేటర్​ ఎన్నికల ప్రచారం కేంద్ర హోంశాఖమంత్రి అమిత్​షాహైదరాబాద్​ పరిస్థితి మార్చేందుకే వచ్చా: అమిత్​షా

హైదరాబాద్​: హైదరాబాద్​ను నిజాం కల్చర్​ నుంచి మార్చి కొత్త నగరంగా నిర్మిస్తామని కేంద్ర హోంశాఖమంత్రి అమిత్​షా అన్నారు. గ్రేటర్​ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన హైదరాబాద్​కు వచ్చారు. ముందుగా పాతబస్తీలో చార్మినార్​ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హైదరాబాద్​ పరిస్థితి మార్చేందుకే వచ్చా: అమిత్​షాఅనంతరం ఆయన రోడ్​షో ద్వారా నాంపల్లిలో బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమిత్ షా మాట్లాడారు. మేయర్​ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఒక్కసారి అవకాశం ఇస్తే వరద ప్రవాహానికి అడ్డుగా ఇళ్లను తొలగిస్తామన్నారు. హైదరాబాద్​లో ఇళ్లలోకి నీరు రావడానికి కేసీఆరే కారణమన్నారు. వరద ప్రవాహానికి ప్రజలు ఇబ్బంది పడుతుంటే కేసీఆర్​ ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. గుడ్​ గవర్ననేన్స్ అమలుచేసి హైదరాబాద్​ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. టీఆర్​ఎస్​ ప్రభుత్వం అధికారంలో వచ్చి ఐదేళ్లు పూర్తైనా ప్రజలకు ఏంచేశావో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్​ పరిస్థితి మార్చేందుకే వచ్చా: అమిత్​షాసిటిజన్​ ఛాప్టర్​ ఏమైంది లక్ష ఇళ్లు ఏమయ్యాయో..మూసినదీపై ఆరులైన్ల రోడ్డు ఏమైందో, పదివేల కోట్లు ఎక్కడ ఖర్చు చేశావో చెప్పాలన్నారు. ఉస్మానియా,గాంధీపై భారం తగ్గించేందుకు నాలుగు దవాఖానలు కడతానన్నవు​ ఎక్కడా కట్టావో చెప్పాలన్నారు. ఆయుష్మాన్​ భారత్​ అమలు చేయకుండా పేదలకు కార్పొరేట్​ వైద్యం కేసీఆర్ దూరం చేశారన్నారు. ప్రధాని మోడీ ఏం చెప్తే అది చేస్తారన్నారు. జాతీయ రహదారులు నిర్మించామన్నారు. పీఎం స్ట్రీట్​ వెండర్​ యోజన స్కీం ద్వారా మూడు లక్షలమంది లబ్ధి చేకూర్చామన్నారు. స్టార్టప్​ కోసం ప్రత్యేక నిధలు ఇచ్చిన ఘనత మోడీకే దక్కుతుందన్నారు. మజ్లిస్​తో కలిస్తే మాకు ఏం ఇబ్బంది ఉండదన్నారు. బీజేపీ అనేక రాష్ట్రాలో నగరాల్లో అధికారంలో ఉందన్నారు. కేసీఆర్ సచివాలయానికి చాలా ఏళ్లుగా వెళ్లలేదు అందుకే సీఎంకు లెక్కలు తెలియవని షా ఎద్దేవా చేశారు . బీజేపీ వచ్చే ఎన్నికలలో విజయం సాధిస్తుందన్నారు. ఒక్కసారి అవకాశం వస్తే రోహింగ్యాలను ఎలా తరిమికొడతామో చూడాలన్నారు. ఏ ఎన్నికలను పార్టీ ఈజీగా తీసుకోదన్నారు. గల్లీసాబ్​ చేయనందుకే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. త్వరలో ఫోన్​ట్యాపింగ్​పై విచారణ చేస్తామని పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో ఆయన వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్..​ గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ తదిరులు ఉన్నారు.