2025 నాటికి మరో 278 వందే భారత్‌ రైళ్లు..!

2025 నాటికి మరో 278 వందే భారత్‌ రైళ్లు..!

2025 నాటికి మరో 278 వందే భారత్‌ రైళ్లు..!

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వందేభారత్‌ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. రాబోయే రోజుల్లో వాటి సంఖ్యను మరింత పెంచేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తున్నది. 2025 చివరి నాటికి 278 వందేభారత్‌ రైళ్లను రైల్వేశాఖ పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. 2027 నాటికి మొత్తం 478 రైళ్లను పరుగులు పెట్టించాలని యోచిస్తున్నది. ప్రస్తుతం 78 వందే భారత్ రైళ్లను చెన్నైకి చెందిన రైల్వేస్ ఐసీఎఫ్, మేధా అనే ప్రైవేట్ కంపెనీ సంయుక్తంగా తయారు చేస్తున్నాయి. వీటితో పాటు మరో 400 రైళ్లను తయారు చేయాల్సి ఉండగా.. ప్రైవేటు సంస్థలు సైతం భాగం కానున్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ ఈ నెలలో 200 ట్రైన్లకు సంబంధించి టెండర్లు జారీ చేసి.. ఈ నెలాఖరులోగా ప్రక్రియను పూర్తి చేయనున్నది. ఇందులో ఏ కంపెనీ ఈ రైళ్లను సిద్ధం చేస్తుందో కూడా నిర్ణయించనున్నారు. ఇందులో రెండు వేర్వేరు కంపెనీలు రైలు సెట్‌ను తయారు చేయనున్నాయి.

గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పరుగులు..
దేశవ్యాప్తంగా 478 వందేభారత్ రైళ్లను నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తొలిదశలో 78 రైళ్లను అందుబాటులోకి తెచ్చేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ రైళ్లన్నీ చైర్ కార్ మోడల్‌లో తయారు చేస్తున్నారు. అలాగే, స్లీపర్ క్లాస్‌లో 400 కొత్త వందే భారత్ రైళ్లను సిద్ధం చేయనున్నారు. ఇందులో ఈ నెల 200 రైళ్ల తయారీకి టెండర్‌ ఖరారు చేయనున్నారు. ఈ 278 రైళ్లు గరిష్ఠంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడువనున్నాయి. రాబోయే రెండేళ్లలో 278 వందేభారత్‌ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. 2027 వరకు మరో 200 రైళ్లు 2017 వరకు సిద్ధం కానున్నాయి. తొలి దశలో అందుబాటులోకి రానున్న వందే భారత్‌ రైళ్లు దాదాపు 160 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయనున్నాయి. ప్రస్తుతం ఈ రైలు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయి. ట్రాక్‌ల అప్‌గ్రేడేషన్‌, ఫెన్సింగ్‌ ఏర్పాట తర్వాత గరిష్ఠ వేగంతో నడువనున్నాయి. తొలి దశలో మొత్తం రైళ్లు పట్టాలెక్కిన తర్వాత వాటి వేగం గంటకు 200 కిలోమీటర్లకు పెరగనున్నది.

రైళ్లపై దాడి.. 56 కేసులు..
దేశవ్యాప్తంగా పలు మార్గాల్లో ప్రారంభించిన వందే భారత్‌ రైళ్లపై దాడులు జరిగిన విషయం తెలిసిందే. 2022 సంవత్సరంల ఈశాన్య సరిహద్దు రైల్వే పరిధిలో 56 కేసులు నమోదయ్యాయి. వందేభారత్‌ రైళ్లపై దాడులను నిరోధించేందుకు అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది జనవరి 17 వరకు మూడు రాళ్లదాడి ఘటనలు నమోదవగా.. ఇందుకు సంబంధించిన కేసుల్లో ముగ్గురిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. నేరాలను అరికట్టేందుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ‘ఆపరేషన్ జంజాగరన్’ పేరిట ప్రచారం ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.