ఏపీ మహిళా నేతపై కేసు నమోదు

ఏపీ మహిళా నేతపై కేసు నమోదుగుంటూరు జిల్లా: నిన్న గుంటూరులోని కాజా టోల్ గేట్ వద్ద జరిగిన ఘటనపై వడ్డెర కార్పొరేషన్ చైర్ పర్సన్ రేవతిపై కేసు నమోదు అయ్యింది. సెక్షన్ 188, 294బీ, 341, 506ల కింద కేసు నమోదైంది. కాజా టోల్ గేట్ వద్ద సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించి, ఒక ఉద్యోగిపై చేయిచేసుకున్న దేవళ్ల రేవతి. టోల్ కట్టకుండా వెళ్లున్న రేవతి వాహనాన్ని అడ్డుకున్న సిబ్బంది. తమపై చేయి చేసుకోవడంతో మండిపడిన టోల్ గేట్ సిబ్బంది స్థానిక పీఎస్ లో ఫిర్యాదు చేయగా టోల్ గేట్ వద్ద వున్న సిసి కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు రేవతిపై కేసు నమోదు చేశారు. అయితే నిన్న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.తనపై కేసు నమోదు కావడంతో స్పందించిన వడ్డెర కార్పొరేషన్ చైర్ పర్సన్ దేవళ్ల రేవతి మాత్రం అనారోగ్యానికి గురైన తన తల్లిని చికిత్స నిమిత్తం విజయవాడ నుంచి గుంటూరుకు తీసుకెళ్తుండగా కాజా టోల్ గేట్ సిబ్బంది తన పరిస్థితిని అర్ధ చేసుకోకుండా అర్ధగంట పాటు వాహనాన్ని అడ్డుకుని ఇబ్బంది పెట్టారని తెలిపారు. టోల్ గేట్ సిబ్బంది తీరుపై అసహనంతో పాటు, తన తల్లి అనారోగ్య పరిస్థితిపై ఆందోళనతో సిబ్బందిపై చేయిచేసుకున్నట్లు ఆమె తెలిపారు.