‘క్లాప్’ షూటింగ్ పునఃప్రారంభం

'క్లాప్' షూటింగ్ పునఃప్రారంభం

హైదరాబాద్ : ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్ జంట‌గా శ‌ర్వంత్ రామ్ క్రియేష‌న్స్‌, శ్రీ షిర్డీసాయి మూవీస్ ప‌తాకాల‌పై రామాంజ‌నేయులు జ‌వ్వాజి, ఎం. రాజ‌శేఖ‌ర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘క్లాప్‌’. బిగ్ ప్రింట్ పిక్చ‌ర్స్ అధినేత ఐ.బి. కార్తికేయ‌న్ స‌మ‌ర్పిస్తున్నారు. పృథివి ఆదిత్య ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఎంట‌ర్‌టైన‌ర్‌గా త‌యార‌వుతున్న ‘క్లాప్’‌ షూటింగ్ ముగింపు ద‌శ‌లో ఉంది. లాక్‌డౌన్ త‌ర్వాత బుధ‌వారం చెన్నైలో షూటింగ్ పున‌రుద్ధ‌రించారు. ప్ర‌స్తుతం చివ‌రి షెడ్యూల్ నిర్వ‌హిస్తున్నారు. హీరో ఆది పినిశెట్టి, కీల‌క పాత్ర‌ధారి ప్ర‌కాష్ రాజ్‌, ఇత‌ర‌ ప్ర‌ధాన తారాగ‌ణంపై స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఊహించిన దానికి మించి స‌న్నివేశాలు చాలా బాగా వ‌చ్చాయనీ, చెన్నైలోని ఓ భారీ స్టేడియంలో క‌థ‌కు కీల‌క‌మైన స్పోర్ట్స్ బేస్డ్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నామ‌నీ నిర్మాత‌లు తెలిపారు. షూటింగ్ అవ‌గానే, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రిపి, త్వ‌ర‌లో చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తామ‌న్నారు.

తారాగ‌ణం:
ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్‌, కృష్ణ కురుప్‌, నాజ‌ర్‌, ప్ర‌కాష్ రాజ్‌, రాందాస్‌, బ్ర‌హ్మాజీ

సాంకేతిక బృందం:
ద‌ర్శ‌క‌త్వం: పృథివి ఆదిత్య‌
నిర్మాత‌లు: రామాంజ‌నేయులు జ‌వ్వాజి, ఎం. రాజ‌శేఖ‌ర్ రెడ్డి
స‌మ‌ర్ప‌ణ‌: బిగ్ ప్రింట్ పిక్చ‌ర్స్ ఐ.బి. కార్తికేయ‌న్‌
బ్యాన‌ర్స్‌: శ‌‌ర్వంత్ రామ్ క్రియేష‌న్స్‌, శ్రీ షిర్డీసాయి మూవీస్‌
సంగీతం: మేస్ట్రో ఇళ‌య‌రాజా
సినిమాటోగ్ర‌ఫీ: ప్ర‌వీణ్ కుమార్‌
ఎడిటింగ్‌: రాగుల్‌
ఆర్ట్‌: వైర‌బాల‌న్‌, ఎస్‌. హ‌రిబాబు
ఫైట్స్‌: ఆర్‌. శ‌క్తి శ‌ర‌వ‌ణ‌న్
కొరియోగ్ర‌ఫీ: దినేష్ మాస్ట‌ర్‌