ప్రపంచానికే శుభవార్త..కరోనా ఇక ప్రాణాంతకం కాదు

ఇజ్రాయెల్ : కొవిడ్-19పై పరిశోధనలు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ ఆసక్తికర అంశాన్ని బయటపెట్టింది. కొవిడ్‌-19 మహమ్మారిని ఒక సాధారణ జలుబు స్థాయికి తగ్గించే వీలుందని ఆ దేశ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందు కోసం ‘ఫెనోఫైబ్రేట్‌’ అనే ఔషధం ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రపంచానికే శుభవార్త..కరోనా ఇక ప్రాణాంతకం కాదుఈ ఔషధాన్ని శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి వాడుతారు. కరోనా సోకిన మానవ ఊపిరితిత్తుల కణాలపై ల్యాబొరేటరీలో ప్రయోగాలు నిర్వహించగా ఈ విషయం తేలిందని వివరించారు…మానవ ఊపిరితిత్తుల్లో లిపిడ్‌కు సంబంధించిన జీవక్రియలను కరోనా వైరస్‌ అడ్డుకుంటోందని..ఈ ప్రక్రియకు నిలువరించడం ద్వారా కొవిడ్‌ లక్షణాలు పెరగకుండా చూడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొవ్వును కరిగించే శరీర సామర్థ్యాన్ని కరోనా వైరస్‌ అడ్డుకుంటోందని ఈ పరిశోధనలో పాల్గొన్న యాకోవ్‌ నహ్మియాస్‌ అనే శాస్త్రవేత్త తెలిపారు. ఈ వైరస్‌ అడ్డుకున్న డీఎన్‌ఏ భాగాన్ని యాక్టివ్ చేయడం ద్వారా ఆ ప్రక్రియను ఫెనోఫైబ్రేట్‌ పునరుద్ధరిస్తుందని ఆయన తెలిపారు. కొవ్వు పేరుకుపోయే ప్రక్రియను ఊపిరితిత్తుల కణాలు చేపట్టేలా వైరస్‌ ప్రేరేపిస్తుందని..అయితే, ఫెనోఫైబ్రేట్‌ ఆ కొవ్వును కరిగించేలా కణాలకు వీలు కల్పిస్తుందని యాకోవ్‌ నహ్మియాస్‌ వివరించారు. ఫెనోఫైబ్రేట్‌ ఔషధానికి సంబంధించిన ఈ లక్షణం వల్ల వైరస్‌ పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుందని చెప్పుకొచ్చారు. తద్వారా కరోనా వైరస్ పూర్తిగా అంతర్థానమయ్యే వీలుందని పేర్కొన్నారు. దీంతో అది ఒక సాధారణ జలుబు కలిగించే వైరస్‌గా మిగిలిపోతుందని ఆయన వివరించారు.