హీరో శ్రీకాంత్ కు కరోనా

హీరో శ్రీకాంత్ కు కరోనాహైదరాబాద్ : ప్రముఖ నటుడు హీరో శ్రీకాంత్ కరోనాబారినపడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్ గా నిర్ధారణ అయిందని తెలిపారు. ఈ మధ్యకాలంలో తనను కలిసినవారు పరీక్షలు చేయించుకోవాలని ట్విట్టర్ ద్వారా సూచించారు. ‘తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. గత రెండ్రోజులుగా స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నా. ఈ మధ్యకాలంలో తనను కలిసినవారు పరీక్షలు చేయించుకోవాలని, ఏవైనా లక్షణాలు ఉన్నాయేమోనని నిశితంగా పరిశీలించండి’ అని శ్రీకాంత్ ట్విట్టర్ లో పోస్టు చేశారు.