ప్రగతి భవన్ లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

ప్రగతి భవన్ లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

హైదరాబాద్ : ప్రగతిభవన్ లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. 73వ రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకుని సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు మహాత్మాగాంధీ , అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. దేశానికి వారు చేసిన సేవలను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఈ వేడుకల్లో సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎంవో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అంతకు ముందు యుద్ధవీరులకు సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో ఉన్న అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్న సీఎంకు త్రివిధ దళాధిపతులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి యుద్ధవీరులకు వందనం చేశారు.