ఢిల్లీలో భూప్రకంపనలు

ఢిల్లీలో భూప్రకంపనలుఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గురువారం రాత్రి భూమి కంపించింది. దీంతో భయాందోళనతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్టు సమాచారం లేదు. అలాగే నోయిడా, గురుగ్రామ్​లో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి. భూకంప తీవ్రత 4.2గా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. హర్యానాలో గల గురుగ్రామ్​ నైరుతి దిశలో 48 కిలోమీటర్ల దూరంలో, 7.5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపారు. అర్థరాత్రి 11 గంటల 46 నిమిషాలకు భూమి కంపించిందని పేర్కొన్నారు. ఢిల్లీ భూ ప్రకంపనలు వచ్చాయని ప్రసార భారతీ ట్వీట్ చేసింది. ఢిల్లీ మరియు పరిసర ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు బలమైన ప్రకంపనలు సంభవించినట్టు తెలిపింది.