విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం

విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదంవరంగల్ టైమ్స్, విశాఖ : విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం జరిగింది. ఎస్ఎంఎస్-2 లో ద్రవ ఉక్కు తీసుకెళ్తున్న లాడిల్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఆరుగురు ఒప్పంద కార్మికులు, ఇద్దరు శాశ్వత ఉద్యోగులు, ఒక డీజీఎం స్థాయి అధికారి ఉన్నారు. లాడిల్ లో ద్రవ ఉక్కు తరలిస్తుండగా అకస్మాత్తుగా పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. వీరిని మొదట స్టీల్ ప్లాంట్ లోని జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాథమిక వైద్యం అందించారు. అనంతరం బాధితులను మెరుగైన వైద్యం కోసం విశాఖ నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది యాజమాన్యం.