టీఆర్ఎస్ కు షాక్.. బీజేపిలో చేరిన స్వామి గౌడ్

టీఆర్ఎస్ కు షాక్.. బీజేపిలో చేరిన స్వామి గౌడ్

హైదరాబాద్‌: తెలంగాణ శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ బీజేపీలో చేరారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. కొంతకాలంగా టీఆర్‌ఎస్‌ పార్టీకి దూరంగా ఉంటున్న స్వామిగౌడ్‌.. ఎట్టకేలకు బీజేపీకి జై కొట్టారు. ఇదిలా ఉంటే స్వామిగౌడ్‌తో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ నేత లక్ష్మణ్‌ సమావేశమై బీజేపీలోకి రావాలని ఆయనను కొదరు. అప్పుడే ఆయన పార్టీ మారతారని ప్రచారం జరిగినా ఎందుకో ఈరోజు వరకు ఆయన అగారు. టీఎన్జీవో నేతగా, తెలంగాణ ఉద్యమంలో అనంతరం టీఆర్ఎస్ పార్టీలో స్వామిగౌడ్ చురుకైన పాత్ర పోషించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు నమ్మిన వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. దీంతో ఆయనకు శాసనమండలి ఛైర్మన్ బాధ్యతలు అప్పగించారు. ఆ పదవీ కాలం పూర్తి అయ్యాక ఆయన్ని తెరాస పక్కన పెట్టింది.