పోలీస్ కమిషనర్ రవిందర్ కు ఘనంగా సన్మానం

వరంగల్ అర్బన్ జిల్లా: ప్రజాప్రతినిధులను, అధికారులనే కాదు అన్ని వర్గాల వారిని మెప్పిస్తూ వృత్తి బాధ్యతను సున్నితంగా , అత్యంత జాగ్రత్తగా నిర్వర్తించిన ఘనత వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవిందర్ కే దక్కుతుందని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు. జూన్ 30నపోలీస్ కమిషనర్ రవిందర్ కు ఘనంగా సన్మానంసి.పి. విశ్వనాథ రవిందర్ పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా హన్మకొండలోని సీ.ఎస్ .ఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో సి.పి రవీందర్ ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సన్మానించారు. పదవీ విరమణ చేస్తున్న సీపీ రవీందర్ కి శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘమైన ఉద్యోగ పదవీ విరమణ అదృష్టమని, ఆయన తన విధులను అత్యంత సున్నితంగా, జాగ్రత్తగా నిర్వర్తించారని మంత్రి అన్నారు. కరోనా లాంటి క్లిష్ట సమయాల్లో అత్యంత సమర్థవంతంగా పని చేసి, పోలీస్ విభాగాన్ని నడిపించారని గుర్తుచేశారు.

పోలీస్ శాఖ సమర్థవంతంగా పని చేస్తే మిగతా పనులు సవ్యంగా సాగుతాయని మంత్రి తెలిపారు.
పదవీ విరమణ తర్వాత సీపీ రవీందర్ ఆయుఃరారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, చల్లా ధర్మా రెడ్డి, నన్నపనేని రవీందర్, ఆరూరి రమేశ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, మేయర్ గుండా ప్రకాష్ రావు, కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, వరంగల్ అర్బన్ రూరల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్ హన్మంతు గాంధీ , హరిత, పోలీస్ అధికారులు, సీపీ కుటుంబ సభ్యులు, ఆత్మీయులు తదితరులు పాల్గొన్నారు.