హైదరాబాద్ : దళపతి విజయ్ కథానాయకుడిగా నగరం, ఖైదీ చిత్రాలతో సెన్సేషల్ హిట్స్ సాధించిన డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో మాస్టర్ చిత్రాన్ని ఎక్స్‌బీ ఫిల్మ్ క్రియేటర్స్ బ్యానర్‌పై గ్జేవియర్ బ్రిట్టో నిర్మించారు. ఈ సినిమా తెలుగు హక్కులను ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్ కోనేరు దక్కించుకున్నారు. ఇంతకు ముందు హీరో విజయ్ చిత్రం ‘విజిల్’ను తెలుగులో ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్ కోనేరు విడుదల చేశారు. ‘విజిల్’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో మాస్టర్ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ఈ సినిమాను భారీ రేంజ్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మహేశ్ కోనేరు. గురువారం ఈ సినిమా టీజర్ విడుదలైంది. “విజయ్ గత చిత్రం ‘విజిల్’ను మా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సూపర్‌హిట్ అయ్యింది. ఇప్పుడు మరోసారి విజయ్ నటించిన క్రేజీ మూవీ మాస్టర్‌ను తెలుగు ప్రేక్షకులకు అందించడం ఆనందంగా ఉంది. మాస్టర్‌ను భారీ రేంజ్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం ‘మాస్టర్’గా హీరో విజయ్ ఎలాంటి మేజిక్ చేయబోతున్నారో టీజర్‌లో చిన్న టచ్ ఇచ్చారు. టీజర్‌కు ట్రెమెండెస్ రెస్పాన్స్ వస్తుంది. విజయ్ మాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని నగరం, ఖైదీ వంటి సూపర్‌డూపర్ హిట్ చిత్రాలను రూపొందిన దర్శకుడు లోకేశ్ కనకరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమాపై భారీ అంచనాలున్నాయి. అంచనాలకు ధీటుగా సినిమా ఉంటుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో విడుదల కాబోతున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను త్వరలోనే అనౌన్స్ చేస్తాం” అన్నారు ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్ కోనేరు.
నటులు:
విజయ్, విజయ్ సేతుపతి, మాళవికా మోహనన్, ఆండ్రియా, సంతాను భాగ్యరాజ్, అర్జున్ దాస్ తదితరులు