అయ్యప్ప భక్తులకు గుడ్​ న్యూస్​

అయ్యప్ప భక్తులకు గుడ్​ న్యూస్​కేరళ : అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం గూడ్​ న్యూస్​ చెప్పింది. హైకోర్టు అనుమతితో నేటి నుంచి ఐదువేల మంది భక్తులకు దర్శనానికి అనుమతి ఇచ్చింది. అయితే శబరిమలకు వచ్చే భక్తులు తప్పనిసరిగా కొవిడ్​ నెగిటివ్​ రిపోర్టు తీసుకుని వస్తేనే దర్శనానికి అనుమతి ఉంటుందని శబరిమల అధికారులు స్పష్టంచేశారు. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజు 2వేల మంది, శని, ఆదివారాల్లో 3 వేల చొప్పున భక్తులకు అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించింది. ఇక వార్షిక మండల మకరవిళక్కు పూజ కోసం దేవస్థానాన్ని నవంబర్ 15వ తేదీ సాయంత్రం తెరిచారు. ఈ పూజ రెండు నెలలపాటు కొనసాగనుంది. ఈ క్రమంలో భక్తుల తాకిడి ఎక్కువయ్యే నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఎంతో పేరొందిన పుణ్యక్షేత్రం శబరిమలకు ఎక్కువ మంది భక్తులు వెళ్లడానికి అవకాశం ఇస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై శబరిమలలో హైఅథారిటీ కమిటీ సమావేశమైంది. ప్రతి రోజు ఐదువేల మంది భక్తులకు అనుమతించాలని కేరళ హైకోర్టు ఆదేశిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ముందుగానే సమావేశమై చర్చించారు. శబరిమలలో ఉద్యోగం చేస్తున్నసాటి ఉద్యోగులు, శబరిమలకు వచ్చి వెళ్తున్న అయ్యప్పస్వామి భక్తులతో నిత్యం టచ్‌లో ఉన్న ఉద్యోగులు, సిబ్బంది అందరికి తప్పకుండా కొవిడ్​ పరీక్షలు నిర్వహించాలని శబరిమల హైఅథారిటీ కమిటీ నిర్ణయించింది. ఎవరికైనా కొవిడ్ పాజిటివ్ అని తేలితే కొండకిందకు పంపించాలని, వారు మళ్లీ విధులకు హాజరు కాకుండా చూడాలని శబరిమల దేవస్వం బోర్డు నిర్ణయించింది.