భారీగా డ్రగ్స్​ పట్టివేత

భారీగా డ్రగ్స్​ పట్టివేతహైదరాబాద్​ : ఆహార పదార్థాలలో డ్రగ్స్​ను రవాణా చేస్తున్న ముఠాను శనివారం డీఆర్​ఐ అధికారులు పట్టుకున్నారు. విదేశాల నుంచి డ్రగ్స్​ హైదరాబాద్​కు సరఫరా అవుతుందని వచ్చిన సమాచారం మేరకు అధికారులు ఎయిర్​పోర్టులో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్​కు డ్రగ్స్​ను సరఫరాను చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నారు. కిలోకి పైగా మెథమెటమిన్​ డ్రగ్​గా గుర్తించినట్లు తెలిపారు. ఫుడ్​ ఐటమ్​లో కలిపి తీసుకునే ఈ మత్తు పదార్థం అత్యంత ప్రమాదకరమైనదిగా అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డ్రగ్స్​ విలువ కోట్లలో ఉంటుందని తెలిపారు. ఫుడ్​ మెటీరియల్​ చాటున సరఫరా అవుతున్న ఈ డ్రగ్స్​ వ్యవహారంపై విచారణ చేపడుతామన్నారు.