చిత్రం ‘జల్లికట్టు’కు అరుదైన గౌరవం దక్కింది

చిత్రం ‘జల్లికట్టు’కు అరుదైన గౌరవం దక్కిందిహైదరాబాద్: ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న మలయాళ చిత్రం ‘జల్లికట్టు’కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక ఆస్కార్ బరిలోకి భారత్‌ తరపున అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. ఉత్తమ అంతర్జాతీయ భాషా చిత్రాల కెటగిరీలో ఈ చిత్రం అర్హత సాధించింది. ఫ్లిల్మ్ మేకర్ రాహుల్ రానైల్ నేతృత్వంలోని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యురీ ఈ చిత్రాన్ని ఎంపిక చేసింది. మొత్తం 26 చిత్రాలకు గాను ఈ సినిమా ఆస్కార్ బరిలోకి ఎంపిక కావడం విశేషం. 14 మంది సభ్యులతో కూడిన జ్యురీ జల్లికట్టు మూవీని సెలెక్ట్ చేసినట్టు రాహుల్ తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన లొకేషన్, టెక్నీకల్, హ్యూమన్ యాస్పెక్ట్స్ అన్నీ దీన్ని ఇందుకు అర్హమైనవిగా నిలబెట్టాయని ఆయన చెప్పారు. మ‌నుషులు, జంతువుల మ‌ధ్య బావోద్వేగ పూరిత స‌న్నివేశాల‌ను కళ్లకు క‌ట్టిన‌ట్టు చూపించారని, అందకే ఈ సినిమాను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.