దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్..కెప్టెన్ గా కేఎల్ రాహుల్!

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్..కెప్టెన్ గా కేఎల్ రాహుల్!బెంగుళూరు : దక్షిణాఫ్రికాతో జనవరి 19 నుంచి ప్రారంభంకానున్న వన్డే సిరీస్ కు సారథ్య బాధ్యతలను కేఎల్ రాహుల్ చేపట్టే అవకాశాలున్నాయి. నిజానికి వన్డే సిరీస్ కోసం కెప్టెన్ గా రోహిత్ శర్మను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. కానీ గాయపడిన రోహిత్ ప్రస్తుతం బెంగుళూరులోని ఎన్సీఏ అకాడమీలో కోలుకుంటున్నారు.

ఒకవేళ వన్డే సిరీస్ సమయానికి రోహిత్ కోలుకోని పక్షంలో , కెప్టెన్సీ బాధ్యతలను రాహుల్ చేపట్టే ఛాన్సెస్ ఉన్నట్లు సమాచారం. టెస్ట్ కెప్టెన్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీని , వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దక్షిణాఫ్రికా, టీంఇండియా మధ్య తొలి టెస్టు నడుస్తోంది.