వరంగల్ లో దారుణం

వరంగల్ లో దారుణం

వరంగల్ అర్బన్ జిల్లా : మామునూర్ పోలీస్​ స్టేషన్ పరిధిలోని నక్కలపెల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఓ ప్రేమ జంట వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మున్సిపల్​ విపత్తు నిర్వహణ బృందం బావిలో గాలించి మృతదేహాలను వెలికి తీసింది. మృతులు సాయికుమార్​, అశ్వినిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.