‘హాత్ సే హాత్ అభియాన్’ సక్సెస్ చేయండి: జంగా

‘హాత్ సే హాత్ అభియాన్’ సక్సెస్ చేయండి: జంగా'హాత్ సే హాత్ అభియాన్' సక్సెస్ చేయండి: జంగా

వరంగల్ టైమ్స్, జనగామ జిల్లా : ఫిబ్రవరి 6 నుంచి చేపట్టబోయే ‘హాత్ సే హాత్ అభియాన్’ యాత్రను విజయవంతం చేయాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి పిలుపునిచ్చారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ కర్గే ఆదేశానుసారం రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర ఫిబ్రవరి 6న ముగుస్తుందని, ఈ సందర్భంగా ఈ యాత్రను నిర్వహిస్తున్నట్లు ఓ ప్రకటనలో జంగా రాఘవరెడ్డి తెలిపారు.

ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశానుసారం పీసీసీ మెంబర్ జిల్లా పార్టీ కమిటీ సభ్యులు, జిల్లా అనుబంధ సంఘాలు, కౌన్సిలర్ లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతీ గ్రామాలలో జాతీయ జెండాతో పాటు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని జంగా రాఘవరెడ్డి పిలుపునిచ్చారు.

గ్రామాలలో ఇంటింటికి డోర్ స్టిక్కర్స్ అతికించి కరపత్రాలు ఇచ్చుకుంటూ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాగానే ఇచ్చిన హామీలను మర్చిపోయిన విషయాన్ని వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను ప్రజలకు తెలియజేసే విధంగా ఇంటింటా ప్రచార కార్యక్రమం చేయాలని జంగా రాఘవరెడ్డి విజ్ఞప్తి చేశారు.